‘హెచ్‌–1బీ’కి ఇక ఇ–రిజిస్ట్రేషన్‌

8 Dec, 2019 04:27 IST|Sakshi

వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ

వాషింగ్టన్‌: భారత్‌ టెక్కీల డాలర్‌ కలలను నెరవేర్చే, అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించే హెచ్‌–1బీ వీసా దరఖాస్తు విధానాన్ని మార్చినట్లు అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది. 2021ఏడాది హెచ్‌1బీ దరఖాస్తులను ఇకపై ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కంపెనీలు తాము తీసుకోబోయే ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందజేయాలని కోరింది.

రిజిస్ట్రేషన్‌ కోసం 10 డాలర్లను ఫీజుగా చెల్లించాలి. ఏటా 85 వేల హెచ్‌–1బీ వీసాలను ఈ వీసా దరఖాస్తులు పూర్తయ్యాక లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన 85 వేల వీసాలు మంజూరు చేస్తారు. ‘ఎలక్ట్రానిక్‌ ప్రక్రియ వల్ల పేపర్‌ వర్క్‌  తగ్గుతుంది. ఐటీ కంపెనీల, ఉద్యోగుల సమాచారం ఇవ్వడం సులభతరం అవుతుంది’అని ఇమిగ్రేషన్‌ అధికారులు వెల్లడించారు. 2020–21 సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్, ఏప్రిల్‌ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు