72 ఏళ్ల తర్వాత బయటపడింది!

27 May, 2016 13:43 IST|Sakshi
72 ఏళ్ల తర్వాత బయటపడింది!

అది ఎప్పుడో 1944వ సంవత్సరం. అప్పట్లో రెండో ప్రపంచయుద్ధం భీకరంగా జరుగుతోంది. ముగ్గురు సిబ్బందితో కూడిన అమెరికా బాంబర్ విమానం ఒకటి శత్రుస్థావరాల మీద దాడికి బయల్దేరింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా అది వెళ్తుండగా శత్రుసైన్యాలు దాన్నిగుర్తించి పేల్చేశాయి. దాంతో ఆ విమానం కాస్తా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ఘటన జరిగి ఇప్పటికి 72 ఏళ్లు గడిచింది. టీబీఎం-1సి అవెంజర్ విమానం ఇన్నేళ్ల తర్వాత సముద్ర అడుగుభాగంలో కనిపించింది. దాంట్లోనే విమాన సిబ్బంది అవశేషాలు కూడా కనిపించాయి. ఇన్నాళ్ల బట్టి ఆ విమానం కోసం శాస్త్రవేత్తలు గాలిస్తూనే ఉన్నారు.

ఇలా వివిధ సందర్భాల్లో కనిపించకుండా పో యిన అమెరికన్ విమానాలను కనిపెట్టేందుకు 'ప్రాజెక్ట్ రికవర్'ను చేపట్టారు. ఆ ప్రాజెక్టు సాధించిన విజయాల్లో ఇదొకటి. అత్యాధునిక సోనార్ టెక్నాలజీని ఉపయోగించి విమానాలు ఎక్కడున్నాయో వీళ్లు తెలుసుకుంటారు. కనిపించకుండా పోయిన సిబ్బంది మృతదేహాలలో మిగిలిన భాగాలను దేశానికి తీసుకొచ్చి, వారికి సగౌరవంగా అంత్యక్రియలు జరిపించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ప్రాజెక్ట్ రికవర్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎరిక్ టెరిల్ తెలిపారు.

మరిన్ని వార్తలు