శబ్దాన్ని చూసేద్దాం పదండి..

7 Apr, 2019 01:55 IST|Sakshi

మీరెప్పుడైనా శబ్దాన్ని చూశారా..? ప్రశ్న తప్పుగా అడుగుతున్నామని భ్రమపడకండి. ఆ ప్రశ్న నిజమే.. అదేంటి శబ్దాన్ని వింటాం కానీ.. చూడటమేంటి.. ఇదే కదా మీ మనసులో మెదిలే ప్రశ్న? ఈ ఫొటోలో ఉన్నదేంటో తెలుసా.. శబ్ద తరంగాలు. ఎంత అందంగా ఉన్నాయో కదా.. అమెరికాలోని ఫిలడెల్ఫియా పట్టణానికి చెందిన లిండెన్‌ గ్లెడ్‌హిల్‌ అనే శాస్త్రవేత్త, ఫొటోగ్రాఫర్, ఫార్మాసూటికల్‌ బయోకెమిస్ట్‌కు శబ్దాన్ని చూడటం, వాటితో ఆడుకోవడం అంటే సరదా.. అంతే కాదు శబ్దాన్ని ఫొటో తీసి అందరికీ చూపించడం ఆయనకు అదో తృప్తి.

'అందుకే శబ్ద తరంగాలను వివిధ తరంగ ధైర్ఘ్యాల వద్ద ఫొటోలు తీస్తుంటాడు. శబ్దాలను ఫొటో తీసే పరికరం చాలా సులువుగా ఉంటుందని గ్లెడ్‌హిల్‌ వివరించాడు. స్పీకర్‌పై పలుచటి పొరపై నీరు ఉంటుందని, ఆ నీటిపై ఎల్‌ఈడీ కాంతిని ప్రసరిస్తామని చెప్పాడు. ‘నీటి గుండా శబ్దాన్ని పంపడం వల్ల తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలను ఎల్‌ఈడీ కాంతిని వెదజల్లే ఉపరితలంపైకి పంపుతాం. ఈ సమయంలో శబ్దాన్ని కెమెరా ఫొటోలు తీస్తుంది. తరంగాలు మనం నిర్ణయించే పౌనఃపుణ్యాన్ని బట్టి మారుతుంది. దాన్ని బట్టే ఫొటోలు కూడా మారుతాయి’అని వివరించాడు.

మరిన్ని వార్తలు