భూగర్భ జలాల్లో భారీగా యురేనియం!

9 Jun, 2018 02:46 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్‌లోని 16 రాష్ట్రాల్లోని భూగర్భ జలాలు యురేనియంతో భారీగా కాలుష్యమయమైనట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) ప్రమాణాల కన్నా ఎక్కువగా యురేనియం కాలుష్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాగునీరు, సాగు నీటిలోనూ యురేనియం కాలుష్యం ఎక్కువగా ఉందని అమెరికాలోని డ్యూక్‌ యూనిర్సిటీ పరిశోధకులు చెప్పారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో అధ్యయనం జరపగా.. రాజస్తాన్, గుజరాత్‌ వ్యాప్తంగా ఉన్న 324 బావుల్లోని నీటిలో భారీ స్థాయిలో యురేనియం ఉన్నట్లు తేలింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం దేశంలో లీటరుకు 30 మైక్రోగ్రాముల వరకు యురేనియం ఉండవచ్చు.

మరిన్ని వార్తలు