రోడ్డును చీల్చుకొని వచ్చినట్లుంది కదా..!

10 Jan, 2018 11:46 IST|Sakshi

న్యూయార్క్‌ : అమెరికాలో విపరీతంగా ఉన్న చలి జనాలనేకాదు.. జంతుజాలాన్ని సైతం బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ఉత్తర కరోలినాలో గత వారం వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకొని మునుపెన్నడూ లేనంత భయంకరంగా కనిపిస్తోంది. తీవ్రమైన చలి ధాటికి అక్కడి వాగులు, వంకలు, చిన్నచిన్న నీటి జలాశయాలు గడ్డకట్టుకుపోయాయి. పార్క్‌లల్లో ఏర్పాటు చేసిన నీటి గుంటలు కూడా గడ్డకట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో జంతువులు నరకం చూశాయి. అందుకు సాక్ష్యంమిచ్చేలా ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా మొసళ్లు 40 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ వరకు ఉండే నీటిలో జీవిస్తాయి. కానీ, విపరీతమైన చలికారణంగా గడ్డ కట్టుకుపోయిన స్వామ్‌ పార్క్‌లోని ఓ నీటి గుంటలో మొసళ్లన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రాణాలను రక్షించుకునేందుకు తమ బాడీ మొత్తం నీటిలో పెట్టి కేవలం శాసేంద్రియాలు బయటకు ఉండేలా తలపైకెత్తి రక్షించండి మహాప్రభో అన్నట్లుగా చూస్తున్నాయి. ఆ నీటి గుంటల్లో కేవలం అవి తల పైకి పెట్టిన చోట తప్ప మిగితా మొత్తం కూడా గాజు ఫలకలా నీరు గడ్డకట్టుకుపోయింది. వాటి పరిస్థితి ఏమిటో చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే..


 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనాపై కలసికట్టుగా పోరాడుదాం

ఈ వీడియో నిజంగా కంటతడి పెట్టిస్తుంది

సామాజిక దూరంతోనే మహమ్మారి దూరం

కావాలని కరోనా అంటించుకుని..

ఇది మీకు కాస్త‌యినా న‌వ్వు తెప్పిస్తుంది: డాక్ట‌ర్లు

సినిమా

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?

గురి మారింది

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ