విమానంలో పుట్టిన 'జెట్ స్టార్'

29 Apr, 2016 03:52 IST|Sakshi
విమానంలో పుట్టిన 'జెట్ స్టార్'

ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు ఎయిర్ లైన్స్ పేరు పెట్టుకుంది. నిండు గర్భిణిగా ఉన్న మహిళ జెట్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తుండగా నొప్పులు రావడంతో ఆమెకు సిబ్బంది సహా... విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు డాక్టర్లు కూడ సహకరించారు. దీంతో సుఖప్రసవాన్ని పొందిన ఆమె.. పుట్టిన మగ బిడ్డకు ఎయిర్స్ లైన్స్ పేరు పెట్టుకుంది.

ఏప్రిల్ 22 శుక్రవారం సింగపూర్ నుంచి మయన్మార్ కు ప్రయాణిస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో సా లెర్ టు  అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఉన్నట్టుండి ఆమెకు నొప్పులు రావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది సహా విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గరు డాక్టర్లు సహకరించి సుఖ ప్రసవం జరిగేట్లు చూశారు. విమాన సిబ్బంది తనపై చూపించిన అభిమానానికి కృతజ్ఞతతో సా లెర్ తన బిడ్డకు 'జెట్ స్టార్' అని పేరు పెట్టుకుంది. అనుకోకుండా ఆమె ఇంటిపేరు కూడ స్టార్ అని ఉండటంతో ఆపేరు కలసి వచ్చింది. విమాన ప్రయాణంలో ఎటువంటి ప్రమాదం లేకుండా మహిళకు సహకరించి ఓ అతిచిన్న ప్రయాణీకుణ్ని సురక్షితంగా ప్రసవించేందుకు తమ సిబ్బంది  సహాయపడ్డందుకు ఎంతో గర్వంగా ఉందని ఎయిర్ లైన్స్ తెలిపింది. సహ ప్రయాణీకులతో పాటు బేబీ జెట్ స్టార్ కూడ ప్రయాణించి ప్రశంసలు అందుకున్నాడని, ఇది ఎప్పటికీ మరచిపోలేని సంఘటన అని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. జెట్ స్టార్ పుట్టిన సందర్భాన్ని వేడుకగా జరుపుకునేందుకు వెయ్యి డాలర్ల ఖరీదైన పిల్లల ఉత్పత్తులను జెట్ స్టార్ కుటుంబానికి బహుమతిగా ఇచ్చింది.

మా విమానంలో సా జెట్ స్టార్ పుట్టిన విషయాన్ని తెలియజేయడం మాకెంతో గర్వంగా  ఉందని జెట్ ఎయిర్ వేస్ పోస్ట్ చేసింది.  కస్టమర్ సర్వీస్ మేనేజర్ నేతృత్వంలో సిబ్బంది సహాయం అందించారని,  ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలు 3K583 విమానంలో  యాన్ గన్ లో ల్యాండ్ అయ్యారని, అనంతరం యాన్ గన్ లోకల్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారని ఎయిర్ లైన్స్ పోస్ట్ లో తెలిపింది. 6 పౌండ్ల, ఏడు ఔంసుల బరువుతో పుట్టిన శిశువు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని, ఏషియా విమానంలో ప్రసవం జరగడం ఇదే మొదటి సారని,  వెయ్యి డాలర్ల ఖరీదైన పిల్లల ఉత్పత్తులను జెట్ స్టార్ కుటుంబానికి  బహుమతిగా ఇచ్చామని పోస్ట్ లో వివరించారు.

మరిన్ని వార్తలు