22 సినిమా హిట్‌ కావాలి

3 Feb, 2020 00:55 IST|Sakshi
రూపేష్, నాగార్జున, శివ, నాగచైతన్య

– నాగార్జున

రూపేష్‌ కుమార్, సలోని మిశ్రా జంటగా బి. శివకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘22’. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన నాగార్జున మాట్లాడుతూ–‘‘బి.ఎ రాజు, జయగార్ల అబ్బాయి శివ దర్శకుడు అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘22’ సినిమా టీజర్‌ చూశాను. ఆసక్తికరంగా ఉంది.పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగార్జున విడుదల చేసిన టీజర్‌ వీడియో, ‘22’ క్యాలెండర్‌ను విడుదల చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ–‘‘కొత్తవారిని ప్రోత్సహించడంలో నాగార్జునగారు ముందుంటారు.

కొత్తగా దర్శకులు కావాలనుకునేవారు తొలుత ఓ ప్రేమకథను తీయాలనుకుంటారు. కానీ శివ ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ను డైరెక్ట్‌ చేశాడంటే అతని మెచ్యూరిటీ లెవల్‌ తెలుస్తోంది. హీరోగా రూపేష్‌ చాలా కష్టపడ్డాడనిపిస్తోంది. ఫస్ట్‌ డే మార్నింగ్‌ షో చూడాలనుకుంటున్నాను’’ అన్నారు మారుతి. ‘‘టీజర్‌ను చూసినవారు శివ పెద్ద దర్శకుడు అవుతాడని అంటున్నారు. అది తప్పక జరగాలని కోరుకుంటున్నాను. శివకు జయ ఆశీస్సులు ఉంటాయి’’ అన్నారు బి.ఎ రాజు. ‘‘నాగార్జునగారు టీజర్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యారు’’ అన్నారు శివ. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ సలోని మిశ్రా, నిర్మాత కొండా కృష్ణంరాజు, ఆదిత్య మ్యూజిక్‌ ప్రతినిథులు మాధవ్, నిరంజన్‌రెడ్డి, కో డైరెక్టర్‌ పుల్లారెడ్డి, ఆర్ట్‌ డైరెక్టర్‌ పెద్దిరాజు, సినిమాటోగ్రాఫర్‌ రవికిరణ్, నటుడు కృష్ణచైతన్య, ఎడిటర్‌ శ్యామ్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా