కరోనాతో ఫైట్‌ చేయగలం

22 Mar, 2020 05:02 IST|Sakshi
ఓల్గా కురిలెంకో

‘క్వాంటమ్‌ ఆఫ్‌ సోలేస్‌’ (2008), ‘ఒబ్లివిన్‌’ (2013) చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి ఓల్గా కురిలెంకో. దాదాపు ఐదురోజుల క్రితం ఈ హాలీవుడ్‌ తార కోవిడ్‌ 19 (కరోనా వైరస్‌) బారిన పడ్డట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆరోగ్యం కాస్త బాగానే ఉందనే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు ఓల్గా. ‘‘కాస్త బెటర్‌గా ఫీల్‌ అవుతున్నాను. నా జ్వరం పోయింది. నేను ఎక్కడ ఉన్నానా? అని కొందరు ఆలోచిస్తుండొచ్చు. ప్రస్తుతం నేను లండన్‌లో ఉన్నాను.

కరోనా వైరస్‌ బారిన పడ్డానని టెస్ట్‌ చేయించుకున్నాక తెలిసింది. డాక్టర్లు చెప్పిన మందులతో పాటు వారి సలహా మేరకు విటమిన్స్, కొన్ని సప్లిమెంట్స్‌ (మెడిసిన్స్, హెల్దీపుడ్‌) తీసుకున్నాను. కరోనా వైరస్‌ను విటమిన్స్‌ నిర్మూలిస్తాయని నేను చెప్పడం లేదు. కానీ మనలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. డాక్టర్ల సూచనలు పాటించడంతో పాటు మన జాగ్రత్తల్లో మనం ఉంటే కరోనాతో ఫైట్‌ చేయగలం’’ అని పేర్కొన్నారు ఓల్గా. ఆమె నటించిన ‘ఎంఫైర్స్‌ ఆఫ్‌ ది డీప్,  ది బే ఆఫ్‌ సైలెన్స్‌’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు