అబ్బా..! చంపేశావ్..!

15 May, 2015 23:35 IST|Sakshi
అబ్బా..! చంపేశావ్..!

వరుణ్‌ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏబీసీడి 2’. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డాన్స్ ప్రధానంగా సాగుతుంది. ప్రభుదేవా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం పాటలు, వాటి వీడియోలు కూడా విడుదల చేశారు.  ఈ చిత్రంలోని పాట ‘సన్ సాథియా’ చూసి అలియా ఫ్లాట్ అయిపోయారు. ముఖ్యంగా అందులో శ్రద్ధా డాన్స్ మూమెంట్స్ అలియాకు బాగా నచ్చేశాయట. దాంతో ఆమె చాలా ఆనందంగా ‘‘అబ్బా,,.! చంపేశావ్ శ్రద్ధా!’’ అని ట్వీట్ చేశారు.

వరుణ్‌ధావన్ విషయంలో శ్రద్ధాకపూర్‌కూ, అలియాభట్‌కూ మధ్య పొసగట్లేదు అని మీడియా ఇప్పటికే కోడై కూస్తున్న నేపథ్యంలో అలియా భట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

>