ప్రముఖ నటుడు, యాడ్‌ గురు కన్నుమూత

17 Nov, 2018 15:51 IST|Sakshi

లిరిల్‌, హమారా బజాజ్‌, ఎంఆర్‌ఎఫ్‌ లాంటి   ఐకానిక్‌  యాడ్స్‌

గాంధీ చిత్రంలో జిన్నా పాత్ర

సాక్షి,ముంబై : ప్రముఖ నటుడు, ఐకానిక్‌ యాడ్ ఫిల్మ్ మేకర్ అలెక్యూ పదంసీ (90) కన్నుమూశారు. శనివారం ఉదయం ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. పదంసీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం.

అలెక్యూ లింటాస్‌ ఇండియా యాడ్ ఏజెన్సీ స్థాపించి ప్రఖ్యాతి గాంచారు. ఎన్నో సృజనాత్మకమైన యాడ్స్‌ను  తీసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా లిరిల్‌, హమారా బజాజ్‌, కామసూత్ర కపుల్‌, ఎంఆర్‌ఎఫ్‌ లాంటి ప్రజాదరణ పొందిన యాడ్స్‌ ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్నవే. 2000 సంవత్సరంలో పద్మశ్రీ దక్కింది. ఇండియన్‌ ఎడ్వర్టైజింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సెంచరీ అవార్డుతో ఆయనను  ఎడ్వర్టైజింగ్‌ క్లబ్‌ సత్కరించింది. అలాగే రిచర్డ్ అటెన్‌బరో  ప్రముఖ చిత్రం గాంధీలో ముహమ్మద్ అలీ జిన్నా పాత్ర పోషించారు అలెక్యూ

లింటాస్‌ ఇండియా ఫౌండర్‌,  మోడరన్‌ ఇండియన్‌ ఎడ్వర్టైజింగ్‌ యాడ్‌ గురు ఇక లేరన్న వార్త  ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో సోషల్‌ మీడియాలో సంతాప సందేశాల వెల్లువ కురిసింది. ముఖ్యంగా అలెక్యూ  మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాధ్‌  కోవింద్‌ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపారు.  ఇంకా పలువురు పరిశ్రమ పెద్దలు, ఆర్టిస్టులు అలెక్యూ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు