అమితాబ్‌ ట్విటర్‌ ఖాతాలో ఇమ్రాన్‌ ఫొటో!

11 Jun, 2019 08:31 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది. టర్కీష్‌కు చెందిన హ్యాకర్‌ గ్రూప్‌గా భావిస్తున్న అయిల్దిజ్‌ టిమ్‌ సోమవారం రాత్రి అమితాబ్‌ బచ్చన్‌ ట్విటర్‌ ఖాతాను హ్యాక్‌ చేసింది. అమితాబ్‌ బచ్చన్‌ ప్రొఫైల్‌ ఫొటోను మార్చి.. ఆయన ఖాతాలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోను పెట్టింది. అదేవిధంగా ఆయన వ్యక్తిగత వివరాలను కూడా మార్చి.. ‘లవ్‌ పాకిస్థాన్‌’ అని పేర్కొంటూ టర్కీష్‌ జెండా ఏమొజీని ఉంచింది.

అమితాబ్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై సైబర్‌ యూనిట్‌ దర్యాప్తు జరుపుతోందని ముంబై పోలీసులు చెప్తున్నారు. అమితాబ్‌ ఖాతా కవర్‌ ఫొటోను మార్చి... ఆ స్థానంలో హ్యాకర్లు తమ గ్రూప్‌కు సంబంధించిన ఎగిరే రాబంధు ఫొటోను పెట్టారు. ‘సమస్త ప్రంపచానికి ఇదే మా పిలుపు. టర్కీష్‌ ఫుట్‌బాలర్స్‌ పట్ల ఐస్‌ల్యాండ్‌ రిపబ్లిక్‌ ప్రవర్తించిన తీరును మేం ఖండిస్తున్నాం. మేం మృదువుగా మాట్లాడినా.. కఠినంగా వ్యవహరిస్తాం. అది చెప్పడానికే ఈ సైబర్‌ దాడి.  -అయిల్దిజ్‌ టిమ్‌ టర్కీష్‌ సైబర్‌ ఆర్మీ’ అంటూ హ్యాకర్లు అమితాబ్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. భారత్‌లోని ముస్లింలను ఉద్దేశించి కూడా హ్యాకర్లు పోస్టు చేశారు. అయితే, హ్యాకింగ్‌ బారిన పడ్డ అమితాబ్‌ ట్విటర్‌ అకౌంట్‌ను ఒక గంటలోనే పునరుద్ధరించారు. గతంలో ఈ హ్యాకర్ల గ్రూప్‌ షహీద్‌ కపూర్‌, అనుపమ్ ఖేర్‌ తదితరుల ట్విటర్‌ ఖాతాలను హ్యాక్‌ చేసింది.Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’