తాగిన మైకంలో...

29 Jun, 2019 02:43 IST|Sakshi
విజయ్, మమత, రిషీ

విజయ్, మమత, రిషీ, బేబీ సుహాన, సతీష్, లడ్డు, తేజశ్విని ముఖ్య పాత్రల్లో రాజా విక్రమ నరేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘అమృత నిలయం’. ఆర్‌.పి. సమర్పణలో రామమోహన్‌ నాగుల, ప్రవీణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా పాటలను విడుదల చేశారు. రాజా విక్రమ నరేంద్ర మాట్లాడుతూ– ‘‘తాగిన మైకంలో యువత చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లోని ఓ అంధుడి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించాం. మా సినిమా ద్వారా మంచి సందేశం ఇస్తున్నాం. ‘అపరాజిత సేవా సమితి’లోని అనాథ బాలికల చేత ఫస్ట్‌ లుక్, ఆడియో విడుదల చేయించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రధాన కథ అనాథగా మారిన అంధుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ‘అపరాజిత సేవా సమితి’లోని అనాథ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కల్పించాం. మా బ్యానర్‌ నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇకపైనా చేస్తాం’’ అన్నారు రామమోహన్‌ నాగుల, ప్రవీణ్‌ కుమార్‌.

మరిన్ని వార్తలు