నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్‌ రన్నరప్‌

9 Apr, 2020 10:06 IST|Sakshi

ముంబై : హిందీ బిగ్‌బాస్‌-13 రన్నరప్‌గా నలిచిన ప్రముఖ మోడల్‌ అసిమ్‌ రియాజ్‌ చేసిన ఓ ట్వీట్‌ నెటిజన్ల మనసు దోచుకుంటుంది. ఎల్లకాలం తన గర్ల్‌ఫ్రెండ్‌ పంజాబీ మోడల్‌ హిమాన్షి ఖురానాకు తోడుగా ఉంటానని అసిమ్‌ భరోసా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.. వివరాల్లోకి వెళ్లితే..  ఇటీవల హిమాన్షి.. అసిమ్‌ను ఉద్ధేశించి ఓ ట్వీట్‌ చేసింది. ‘మనల్ని కలిసి చూడాలని ఎవరనుకోవడం లేదు’. అని బాధగా బ్రోకెన్‌ హార్ట్‌ సింబల్‌ను జతచేసింది. దీంతో అసిమ్‌, హిమాన్షి విడిపోయారా అని తమ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఈ ట్వీట్‌పై అసిమ్‌ స్పందించారు. హిమాన్షికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నాడు. ‘బేబీ..ఎవరేమనుకున్నా..ఏం చెప్పినా.. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను’.  అంటూ ప్రేమగా బదులిచ్చారు. (కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి )

ఇక బిగ్‌బాస్‌ 13లో పాల్గొనడం ద్వారా అసిమ్‌, హిమాన్షి కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే అసిమ్‌.. హిమాన్షితో ప్రేమలో పడ్డాడు. అప్పటికే హిమాన్షి  ఎన్నారై ‘చౌ’ తో తొమ్మిది సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌లోకి వచ్చేముందే వెల్లడించింది. అయితే అనంతరం అసిమ్‌తో ప్రేమలో పడిన హిమాన్షి.. చౌతో నిశ్చితార్థాన్ని విరమించుకొని అసిమ్‌తో ప్రేమాయణం కొనసాగించింది. చౌ.. హిమాన్షితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్న విషయాన్ని బిగ్‌బాస్‌ హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌.. అసిమ్‌కు తెలిపాడు. ఇకనుంచి హిమాన్షి బాధ్యత అసిమ్‌ చూసుకోవాలని కోరాడు. కాగా అసిమ్‌, హిమాన్షి అభిమానులు వీరిని ముద్దుగా అసిమాన్ష్‌ అని పిలుస్తారు. (లాక్‌డౌన్‌ వేళ జమ్మూ కశ్మీర్‌లో దారుణం )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా