బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌!

15 Oct, 2019 17:17 IST|Sakshi

హౌస్‌లో గొడవలు రాజుకున్నాయనుకునేలోపే ఏదైనా ఫన్నీ టాస్క్‌ ఇచ్చి ఇంటి సభ్యులను కూల్‌ చేస్తాడు బిగ్‌బాస్‌. అందరూ కుటుంబంలాగా కలిసిపోయారనుకునేలోపే మళ్లీ వాళ్ల మధ్య చిచ్చు పెట్టి అగ్గి రాజేస్తాడు. ఇవాళ కూడా ఇదే ఫార్ములా వాడనున్నాడు. నామినేషన్‌ ప్రక్రియతో బిగ్‌బాస్‌ హౌజ్‌ హీటెక్కగా ఫన్నీ టాస్క్‌తో నవ్వులు పూయించనున్నాడు. తాజా ప్రోమోలో ఇంటి సభ్యులందరూ ఒకే రకమైన వస్త్రాలను ధరించి, వారి చేష్టలతో నవ్వు తెప్పిస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌ ఇంట్లో ఎనభై అయిదు రోజులు పూర్తయ్యాయి. షో ముగియడానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇప్పటివరకు ఇంటి సభ్యులు బయటి ప్రపంచానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. వారిని బంధువులతో ఫోన్‌లో మాట్లాడించడం కానీ, కలవనీయడం కానీ జరగలేదు.

గతంలో అరవై రోజుల పండగలో వితిక, రవి వారి కుటుంబ సభ్యులను కలుసుకుని తనివితీరా కబుర్లు చెప్పుకున్నప్పటికీ మిగతావారికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఒక్కసారి కలుసుకునే చాన్స్‌ ఇవ్వండని కన్నీళ్లతో వేడుకున్నప్పటికీ అందుకు బిగ్‌బాస్‌ ససేమీరా ఒప్పుకోలేదు. కాగా నేటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులందరికీ బిగ్‌బాస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. షో ముగింపుకు వస్తున్నందున ఇంటి సభ్యులకు బూస్ట్‌ ఇవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇంట్లోకి పంపిచనున్నట్టు తెలుస్తోంది. అలీ భార్య మసూమా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూనే ఎమోషనల్‌గా మారింది. మరి ఇంటి సభ్యులందరి ఫ్యామిలీస్‌ను కూడా బిగ్‌బాస్‌ పంపిస్తున్నాడా లేదా అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది. అటు కామెడీ, ఇటు ఎమోషన్స్‌తో నేటి ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బిగ్‌బాస్‌ గారు.. మా ఇంటికి రండి’

బిగ్‌బాస్‌: ‘పాత అలీ కావాలి!’

థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌.. నెట్టింట్లో రచ్చ

బిగ్‌బాస్‌: ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా!’

బిగ్‌బాస్‌: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!

బిగ్‌బాస్‌ : శివజ్యోతి ప్లాన్‌ సక్సెస్‌ అయినట్టేనా!

ఆమెపై పగ తీర్చుకున్న మహేశ్‌!

ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌!

బిగ్‌ బాస్‌ : కంటెస్టెంట్ల మనసులోని మాట ఇదే

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: పునర్నవి

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌.. పునర్నవి క్లారిటీ

బిగ్‌బాస్‌ : ‘అతడు’ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌: ‘బాబా సైకో.. రాహుల్‌ వేస్ట్‌’

బిగ్‌బాస్‌ ఇంట్లో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్!

‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’

బిగ్‌బాస్‌లో సరికొత్త ఆకర్షణ..

హిమజ అలా చేస్తుందని ఊహించా : పునర్నవి

బిగ్‌బాస్‌ విన్నర్‌గా ప్రముఖ సింగర్‌!

బిగ్‌బాస్‌: అందరి బండారాలు బయటపడ్డాయి!

స్టార్‌ ఆఫ్‌ ద బిగ్‌బాస్‌ హౌస్‌ ఆ ఇద్దరే!

బిగ్‌బాస్‌: ఈసారి మామూలుగా ఉండదు!

బిగ్‌బాస్‌: భరించలేకున్నాం.. బుద్ధి చెప్తాం!

బిగ్‌బాస్‌: వరుణ్‌ను ఆడుకుంటున్న నాగ్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లోకి సోగ్గాడి గ్రాండ్‌ ఎంట్రీ!

నామినేట్‌ అయింది ఆ ముగ్గురే

బిగ్‌బాస్‌: గాయపడిన శివజ్యోతి

బిగ్‌బాస్‌: పార్కింగ్‌ చేయకుంటే నామినేట్‌..