త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

6 Nov, 2019 16:59 IST|Sakshi

రాహుల్‌ సిప్లిగంజ్‌.. ఇప్పుడు ఈ పేరు ప్రతీగల్లీలో మారుమోగుతోంది. బిగ్‌బాస్‌ తెలుగు 3 విజేతగా తన పేరు లిఖించుకున్న రాహుల్‌ మొదటిసారి లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు. అందరూ ఓట్లు వేసి గెలిపించడం వల్లే తన లైఫ్‌ మారిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ట్రోఫీని సాధించిన రాహుల్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఓ అభిమాని కోరిక మేరకు రాహుల్‌.. ‘వెన్నెలవే వెన్నెలవే..’ పాట పాడి అందరినీ సంతోషింపజేశాడు. రాహుల్‌, పునర్నవిల గురించి మరో అభిమాని ప్రస్తావించగా పున్నుతో కలిసి త్వరలోనే లైవ్‌లోకి వస్తానని చెప్పాడు. 
 
తాను గెలుస్తానని ఊహించలేదని, ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులు తోపులని రాహుల్‌ అభివర్ణించాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తన క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన వరుణ్‌ గురించి చెప్తూ అతను చాలా మంచోడని చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులందరికీ టాస్క్‌ల్లో బేధాభిప్రాయాలు వచ్చాయే తప్ప అందరూ మంచివాళ్లేనని పేర్కొన్నాడు. ‘నోయెల్‌ అన్న నీ పక్కన ఉన్నంతవరకు నిన్నెవరూ ఏం చేయలేర’ని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దానికి రాహుల్‌ స్పందిస్తూ.. తనకు ఎంతో మద్దతునిచ్చిన నోయెల్‌, ఫలక్‌నుమాదాస్‌ హీరో విశ్వక్‌సేన్‌, డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. పున్ను తనను ఘోరంగా సపోర్ట్‌ చేసిందని, వినకపోతే తిట్టి మరీ చెప్పేదని గుర్తు చేసుకున్నాడు. పీవీవీఆర్‌ (పునర్నవి, వరుణ్‌, వితిక, రాహుల్‌) లేకపోయుంటే నేనింత కష్టపడకపోయేవాడినని, నా గెలుపుకు వాళ్లు కూడా ఓ కారణమని పేర్కొన్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అది టెలికాస్ట్‌ చేయలేదు: బాబా భాస్కర్‌

టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్‌..

బిగ్‌బాస్‌ ఫలితంపై యాంకర్‌ ఝాన్సీ అసహనం

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

బిగ్‌బాస్‌: శ్రీముఖి ఓటమికి కారణాలు ఇవే..

అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్‌ హిట్‌ అయ్యేదే..!

బిగ్‌బాస్‌: రాహుల్‌ గెలుపునకు కారణాలివే..

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

బిగ్‌బాస్‌–3 విజేత రాహుల్‌

బిగ్‌బాస్‌: బాబా ఔట్‌.. విజేత ఎవరంటే!

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున

బిగ్‌బాస్‌ : 50 లక్షలు ఎవరివి?

బిగ్‌బాస్‌: లెక్క తేలింది. రాహుల్‌ గెలిచాడు!

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు

పున్నును ఎత్తుకున్న రాహుల్‌, మొదలుపెట్టారుగా

బిగ్‌బాస్‌ టైటిల్‌ తన్నుకుపోయే ఆ ఒక్కరు?

శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు..

బిగ్‌బాస్‌: హేమ తిరిగొచ్చింది.. శ్రీముఖికి పంచ్‌

శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..