ఈడీకి రూ. 1.2 కోట్లు కట్టిన హీరో!

16 Jun, 2015 20:02 IST|Sakshi
ఈడీకి రూ. 1.2 కోట్లు కట్టిన హీరో!

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రూ. 1.2 కోట్ల సొమ్ము కట్టారు. శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు తనకు ముట్టిన సొమ్ము మొత్తాన్ని ఆయన ఈడీకి కట్టేశారు. ఈ విషయాన్ని మిథున్ న్యాయవాదులు, ఆయన ప్రతినిధులు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విచారణాధికారికి ఆయన రూ. 1.2 కోట్ల డిమాండ్ డ్రాఫ్టును సమర్పించారు.

శారదా గ్రూపు నుంచి తనకు అందిన మొత్తం సొమ్మును ఇచ్చేస్తానని మిథున్ ఇంతకుముందే ఈడీకి చెప్పారని, అందులో భాగంగానే ఈ డీడీని అందజేశారని మిథున్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మే నెలలో మిథున్ చక్రవర్తిని ఈడీ వర్గాలు విచారించాయి. ఆసమయంలో ఆయన కొన్ని డీవీడీలు, సీడీలు, స్క్రిప్టులు వాళ్లకు అందజేశారు. అవన్నీ శారదా గ్రూపు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన సమయంలో వాళ్ల నుంచి తనకు అందినవని ఆయన చెప్పారు.