ఈడీ అంటే ‘ఎక్స్‌టార్షన్‌ డిపార్ట్‌మెంట్‌’ : డీఎంకే ఎంపీ

2 Dec, 2023 15:20 IST|Sakshi
Photo courtesy : Hindustan Times

చెన్నై: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. దిండిగల్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ డాక్టర్‌ నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకున్నందుకు మధురై జోన్‌ ఈడీ అధికారి అంకిత్‌ తివారీని తమిళనాడు విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ పోలీసులు అరెస్టు చేశారు. 

ఈడీ అధికారి అరెస్టు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. డీఎంకే, బీజేపీ పరస్పర మాటల దాడికి దిగాయి. ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కాదని ఎక్స్‌టార్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అని డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఈడీని బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఫైరయ్యారు.

ఈడీపై ఎంపీ దయానిధి మారన్‌ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఒక్క అధికారి  తప్పు చేస్తే మొత్తం ఏజెన్సీనే తప్పు పట్టడం సరికాదని పేర్కొంది. ఈడీ అధికారి అమాయకుడైతే విజిలెన్స్‌ పోలీసులు వచ్చినప్పుడు ఎందుకు పారిపోయాడని స్టేట్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కె.ఎస్‌ అళగిరి ప్రశ్నించారు.

ఇదీచదవండి..ఎంపీ మహువా లోక్​సభ సభ్యత్వం రద్దుకు కేంద్రం చర్యలు!

మరిన్ని వార్తలు