‘తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’

16 Jan, 2019 15:09 IST|Sakshi
బోనీ కపూర్‌

‘రాజ్‌కుమార్‌ చాలా మంచివాడు. ఆయనపై వచ్చిన ఆరోపణలు నేను నమ్మను. తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’ అంటూ నిర్మాత బోనీ కపూర్‌... బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరాణీకి మద్దతుగా నిలిచారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్‌ అక్తర్‌, హర్షద్‌ వాసి, షర్మాన్‌ జోషి తదితర ప్రముఖులు రాజ్‌కుమార్‌కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంత మంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ విషయంపై స్పందించిన హీరో ఇమ్రాన్‌ హష్మీ మాట్లాడుతూ..‘ నేను దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. అయినా హిరాణీ ఈ వీటిని కొట్టిపారేశారు కూడా. నిజ నిర్ధారణ జరిగేంత వరకు ఈ విషయం గురించి కామెంట్‌ చేయకపోవడమే మంచిది’ అని వ్యాఖ్యానించాడు. కాగా బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నానా పటేకర్‌ పదేళ్ల క్రితం సినిమా షూటింగ్‌లో భాగంగా తనను లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్‌ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో #మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. వివిధ రంగాల్లో తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మహిళలు సోషల్‌ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. (టాప్‌ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు.. షాక్‌లో బాలీవుడ్‌!)

రాజ్‌కుమార్‌ హిరాణీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు