‘ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది.. ఎవరు తెచ్చారు’

16 Jan, 2019 15:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఐదోరోజు విచారించింది. నిందితుడి విచారణ న్యాయవాదుల సమక్షంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదోరోజు విచారణలో భాగంగా నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును న్యాయవాది సలీం సమక్షంలో విశాఖపట్నంలోని కైలాసగిరి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో విచారించారు. (కొనసాగుతున్న శ్రీనివాస్‌ విచారణ)

శ్రీనివాస్‌ 20 మంది యువతులతో మాట్లాడిన కాల్‌ డేటా వివరాలపై ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నించారని న్యాయవాది సలీం తెలిపారు. ‘ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది. ఎవరు తెచ్చారు’ అనే అంశాలపై శ్రీనివాస్‌కు ప్రశ్నించారని పేర్కొన్నారు. శ్రీనివాస్‌ కాల్‌ డేటాను అధికారులు పరిశీలించారని చెప్పారు. మిగిలిన రెండు రోజులు శ్రీనివాస్‌ను ఎక్కడ విచారస్తారనేది ఎన్‌ఐఏ ఇంకా చెప్పలేదని సలీం బుధవారం మీడియాకు చెప్పారు.  కాగా, వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన రోజు ఎయిర్ పోర్ట్ లాంజ్ వద్ద ఉన్న ఇద్దరి వ్యక్తుల నుంచి ఎన్‌ఐఏ అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు