షూటింగ్ పూర్తి చేసుకున్న ధనుష్ తొలి సినిమా

28 Feb, 2017 15:03 IST|Sakshi
షూటింగ్ పూర్తి చేసుకున్న ధనుష్ తొలి సినిమా

హీరోగా ఎన్నో విజయాలను అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల నిర్మాతగానే సత్తా చాటుతున్నాడు. అదే జోరులో తనలో ఓ దర్శకుడు కూడా ఉన్నాడంటూ ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ధనుష్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన పవర్ పాండి షూటింగ్ పూర్తయ్యింది. ఒక పక్క నటుడిగా బిజీగా ఉంటూనే దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశాడు ధనుష్.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ధనుష్, సినిమాను పూర్తి చేయడంలో తనుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ధనుష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజకిరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా గౌతమ్ మీనన్, ధనుష్ లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 9న ఆడియోనే.. ఏప్రిల్ 14న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.