దీపావళి పోరులో త్రిముఖ పోరు

18 Oct, 2017 03:33 IST|Sakshi

తమిళసినిమా: దీపావళి, సంక్రాంతి, దసరా పర్వదినాల్లో భారీ చిత్రాలు విడుదలకు పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది అలాంటి హడావుడి పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ఈ దసరా పండుగ సందర్భంగా ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించిన స్పైడర్, విజయ్‌సేతుపతి హీరోగా నిర్మాత ఏఎం.రత్రం నిర్మించిన కరుప్పన్‌ చిత్రాలు మాత్రమే పోటీపడ్డాయి. ఆ తరువాత వినోదపు పన్నును వ్యతిరేకిస్తూ నిర్మాతలమండలి తీసుకున్న నిర్ణయంతో రెండు వారాలు కొత్త చిత్రాలేవీ విడుదల కాలేదు. ఈ తరువాత ఈ సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొనడంతో దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబైన పలు చిత్రాలను విడుదలను వాయిదా వేసుకున్నారు. దీంతో చివరికి మూడు చిత్రాలు మాత్రం ఈ దీపావళికి సందడి చేయడానికి సిద్ధం అయ్యాయి.

మెర్శల్‌ టెన్షన్‌
అందులో భారీ అంచనాలు నెలకొన్న చిత్రం మెర్శల్‌ ఒక్కటే. విజయ్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్‌ కథానాయికలుగా నటిం చారు. అట్లీ దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించింది. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రం విడుదల చిత్ర యూనిట్‌ను, ఎగ్జిబిటర్లు,డిస్ట్రిబ్యూటర్లు, విజయ్‌ అభిమానుల్ని చా లా టెన్షన్‌లో పడేసింది. చిత్రానికి సెన్సార్‌బో ర్డు సర్టిఫికెట్‌ ఇచ్చినా, జంతు సంక్షేమ శాఖ ఎన్‌ఓసీ ఇవ్వకపోవడమే టెన్షన్‌కు ప్రధాన కారణం. ఎట్టకేలకు విడుదలకు రెండు రోజుల ముందు ఆ శాఖ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో అందరూ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

చెన్నైయిల్‌ ఒరునాళ్‌–2
 ఇక రేస్‌లో ఉన్న రెండో చిత్రం చెన్నైయిల్‌ ఒరునాళ్‌ 2. ఇంతకు ముందు తెరపైకి వచ్చిన చెన్నైయిల్‌ ఒరునాళ్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఆ చిత్ర కథానాయకుడు శరత్‌కుమార్‌తోనే నిర్మించిన చిత్రం చెన్నైయిల్‌ ఒరునాళ్‌–2.కల్పతరు పిక్చర్స్‌ పతాకంపై పీకే.రామ్మోహన్‌ నిర్మించిన ఈ చిత్రానికి జేపీఆర్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటి సుహాసిని, నెపోలియన్‌ ముఖ్యపాత్రలను పోషిం చిన ఈ చిత్రం సస్పెన్స్, థ్రిల్లర్‌ ఇతివృత్తంగా తెరెక్కింది.

మేమాద మాన్‌
అదే విధంగా దీపావళికి మూడో చిత్రంగా బరిలోకి దిగుతున్న చిత్రం మేయాద మాన్‌. వైభవ్, ప్రియాభవాని శంకర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ స్టోన్‌ బెంచ్‌ సంస్థ, రాక్‌ఫోర్ట్‌ సంస్థ కలిసి నిర్మించాయి. సంతోష్‌నారాయణన్, ప్రదీప్‌ సంగీతాన్ని అందించారు. రత్నకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినోదమే ప్రధానంగా తెరకెక్కిందని చిత్ర వర్గాలు అంటున్నారు.

మరిన్ని వార్తలు