సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్‌ కోహ్లి

19 Dec, 2019 15:48 IST|Sakshi

ఫోర్బ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో టాప్‌-100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. కేవలం ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా వారికున్న క్రేజ్‌ను బట్టి స్థానాలను కేటాయించినట్లు పేర్కొంది. ఈ లిస్టులో బాలీవుడ్‌ స్టార్లను వెనక్కునెట్టి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారిగా బాలీవుడ్‌ హీరోయిన్లు అలియా భట్‌, దీపిక పదుకునే టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ఖాన్‌ను వెనక్కునెట్టి కిలాడీ అక్షయ్‌ కుమార్‌(రూ.293.25 కోట్లు) రెండో స్థానం సంపాదించుకున్నాడు. మూడు సంవత్సరాలుగా అగ్ర స్థానంలోనే కొనసాగుతూ వచ్చిన సల్మాన్‌ఖాన్‌(రూ.229.25కోట్లు) ఈ యేడు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బాలీవుడ్‌ బ్యూటీలు అలియా భట్‌, దీపిక పదుకునే 8, 10 స్థానాల్లో పాగా వేశారు. ‘కౌన్‌ బరేగా కరోడ్‌పతి’తో ప్రేక్షకులకు మరింత దగ్గరైన బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ రూ.239.25 కోట్లతో నాలుగో తర్వాతి స్థానంలో నిలిచాడు. బాలీవుడ్‌ హీరోలు షారుఖ్‌ ఖాన్‌, రణవీర్‌ సింగ్‌ ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. గతేడాది ఈ జాబితాలో పేరు కానరాని డార్లింగ్‌ ప్రభాస్‌(రూ.35 కోట్లు) ఈ సారి ఏకంగా 44వ స్థానంలో ఉన్నాడు. నిరుడు 33వ స్థానంలో ఉన్న టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు(రూ.35 కోట్లు) 54వ స్థానానికి పరిమితమయ్యారు. తొలిసారిగా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌(రూ.21.5 కోట్లు) 77వ స్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఈ యేడు సెలబ్రిటీల ఆదాయం 22 శాతం పెరిగినట్టుగా ఫోర్బ్స్‌ వెల్లడించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అలీకి పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి

‘తిరుపతి పార్ట్‌నర్‌కు థ్యాంక్స్‌’

‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు

నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను!

డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది..

అలీకి మాతృ వియోగం

దక్షిణాదిలో జాన్వి ఎంట్రీ షురూ?

నటి పెళ్లి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌..

ఇది చాలదని చరణ్‌ అన్నారు

వైఫ్‌ ఆఫ్‌ రామ్‌

సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను

ఆటకైనా.. వేటకైనా రెడీ

బ్లాక్‌బస్టర్‌ బహుమతి

డిఫరెంట్‌ లుక్స్‌లో కీరవాణి తనయుడు..

ఇరగదీసిన సూపర్‌ స్టార్స్‌..

హ్యాపీ బర్త్‌డే పాప: వరుణ్‌ తేజ్‌

ఇట్స్‌ ప్యాకప్‌ టైమ్‌..

తీన్‌మార్‌ హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతుందా..

రూలర్‌ సాంగ్‌: యూత్‌ గుండెల్లో అలారమే..

జైలులో నిద్రలేని రాత్రి గడిపా : పాయల్‌

రిలీజ్‌కు ముందే 150 టికెట్లు కొన్న వీరాభిమాని

బ్లాక్‌బస్టర్‌ గిఫ్ట్‌ లోడ్‌ అవుతోం‍ది!

నాకు ఎంతటి అవమానం జరిగిందో..

స్విట్జర్లాండ్‌లో సినీ సిస్టర్స్‌

సీనియర్‌ నటుడు కన్నుమూత

అమితాబ్‌ సూచనను పాటించలేకపోతున్నా

ట్రైలర్‌ బాగుంది – రామ్‌గోపాల్‌ వర్మ

హీరో రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు!

ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బంది అదే!

అదే మా బ్యానర్‌ విజయ రహస్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్‌ కోహ్లి

అలీకి పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి

అశ్వథ్థామ నుంచి అందమైన పాట..

‘తిరుపతి పార్ట్‌నర్‌కు థ్యాంక్స్‌’

‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు

డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది..