మాజీ ప్రియురాలితో..

23 Dec, 2019 07:39 IST|Sakshi
మహా చిత్రంలో హన్సికతో శింబు

సినిమా: సంచలన నటుడు శింబు, నటి హన్సికల మధ్య సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. చాలా డీప్‌గా ప్రేమించుకున్న ఈ జంట ప్రేమాయణం పెళ్లి అంచుల వరకూ సాగి ఆగిపోయ్యింది. అలా మాజీ ప్రియురాలు అయిన హన్సిక 50వ చిత్రంలో అతిథిగా నటించడానికి ఎలాంటి అభ్యతరం చెప్పలేదు శింబు. అవును నటి హన్సిక నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది ఆమె సినీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే 50వ చిత్రం. దీన్ని ఎక్సట్రా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. యుఆర్‌.జమీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. ఆరంభ దశలో దమ్మర దమ్‌ అంటూ హన్సిక దమ్ముకొట్టే ఫొటోలతో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను విడుదల చేసి హడావుడి చేశారు. ఆ తరువాత చల్లబడ్డారు. అసలు ఈ చిత్ర నిర్మాణం ఏ స్థాయిలో ఉందో కూడా తెలియని పరిస్థితి. కాగా తాజాగా ఒక ఫొటోను విడుదల చేశారు.

అందులో నటి హన్సికపై శింబు పడుకుని కళ్లు మూసుకుని తన్మయత్నంలో ఉన్నట్లు దృశ్యం ఉంది. ఇంకే ముందు మరోసారి మహా చిత్ర ప్రచారం వేడెక్కిపోతోంది.ఈ ఫోటోను దర్శకుడు వెంకట్‌ప్రభు తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. అయితే మహా చిత్రానికి సంబంధించిన ఇతర ఏ వివరాలు లేకపోవడంతో ఇదంతా నిద్రాణ దశలో ఉన్న మహా చిత్రం గురించి మరోసారి హైప్‌ తీసుకురావడానికి చేసిన ట్రిక్‌ అని తెలుస్తోంది. ఏదేమైతేనేం మరోసారి మహా చిత్రం వార్తల్లోకి వచ్చింది. జిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు తెరపైకి రానుందో తెలియదు గానీ, తాజాగా విడుదల చేసిన  శింబు, హన్సికల ఫొటో మహా చిత్రంపై ఆసక్తిని మాత్రం రేకెత్రిస్తోంది. అదీ గాక నటుడు శింబు నటించిన చిత్రం విడుదలై కూడా చాలా కాలమైంది. వందా రాజావాదాన్‌ వరువేన్‌ చిత్రం తరువాత మరో చిత్రం తెరపైకి రాలేదు. ప్రస్తుతం కొత్తగా నటిస్తున్న చిత్రం కూడా ఏదీ లేదు. త్వరలో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సురేశ్‌కామాక్షి నిర్మించనున్న మానాడు చిత్రంలో నటించడానికి శింబు రెడీ అవుతున్నారు. ఈలోగా శింబు తన మాజీ ప్రియురాలు హన్సికతో రొమాన్స్‌ చేసిన మహా చిత్రం విడుదలయితే బాగుంటుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు