సిగరెట్ గురించి నోరు విప్పిన‌ హృతిక్

27 Apr, 2020 08:39 IST|Sakshi

ఈ ఫొటోలో బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ కొడుకు ముందే సిగ‌రెట్ కాల్చుతున్నాడా? లేదూ, కొడుకుల‌తో క‌లిసి సిగ‌రెట్ తాగుతున్నాడా? లేక‌పోతే అక్కడ సిగ‌రెట్ ఉన్న‌ట్టు మ‌న‌మే పొర‌ప‌డుతున్నామా? ఇలా ర‌క‌ర‌కాల అనుమానాల‌తో అత‌ని అభిమానుల బుర్ర వేడెక్కిపోయింది. దీంతో ఉండ‌బ‌ట్ట‌లేక హృతిక్‌నే అడిగేశారు. దానికి హీరో బ‌దులిస్తూ త‌న‌కు ధూమ‌పానం అల‌వాటు లేద‌ని స్ప‌ష్టం చేశాడు. నేను క్రిష్(అద్భుత శ‌క్తులున్న పాత్ర‌) అయితే  మొట్ట‌ మొద‌ట‌ ప్ర‌స్తుత‌ వైర‌స్‌ను నిర్మూలించి, వెంట‌నే ఈ భూగ్ర‌హం మీద నుంచి ఆఖ‌రి సిగ‌రెట్ వ‌ర‌కు అన్నింటినీ నాశ‌నం చేస్తాన‌ని పేర్కొన్నాడు. (లాక్‌డౌన్‌: కరీనాకు సలహా ఇచ్చిన అర్జున్‌ కపూర్‌)

త‌న ప్ర‌శ్న‌కు బ‌దులు వ‌స్తుంద‌ని ఊహించ‌ని అభిమాని అనందంతో ఉబ్బిత‌బ్బిబైపోయాడు. అయితే హృతిక్ సిగ‌రెట్ తాగ‌డ‌ని త‌న‌కు తెలుస‌ని, కానీ ఎంతో మంది ఈ ఫొటో చూసి హీరో ధూమ‌పానం చేస్తాడేమోన‌ని భ్ర‌మ‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నాడు. త‌న అనుమానాన్ని నివృత్తి చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. మిగ‌తా అభిమానులు సైతం సిగ‌రెట్ అలవాటు లేని హృతిక్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. "నీకు ఎలాంటి శ‌క్తులున్నా లేక‌పోయినా నువ్వు మాకు క్రిష్‌వే.." అంటూ కామెంట్లతో ప్రేమ‌ను చాటుకుంటున్నారు. ఇంత‌కీ ఈ ఫొటోను హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుశానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (హృతిక్‌రోషన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు)

మరిన్ని వార్తలు