ఆ అమ్మాయి భలే చేసిందే

11 Jun, 2015 14:53 IST|Sakshi
ఆ అమ్మాయి భలే చేసిందే

ఇటీవలే విడుదలై బాక్సాఫీసును కొల్లగొడుతున్న 'తను వెడ్స్ మను రిటర్న్స్' సినిమాలో కంగనా రనౌత్ నటన అద్భుతంగా ఉందని విలక్షణ నటుడు ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. వీళ్లిద్దరూ కలిసి మళ్లీ 'కట్టీ బట్టీ' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తను వెడ్స్ సినిమాలో కంగనా డబుల్ రోల్ చేసింది. అందులో హర్యానా అమ్మాయి పాత్ర చాలా బాగుందని ఇమ్రాన్ అన్నాడు.

ఈ సినిమాలో ఇంకా మాధవన్, దీపక్ డోంబ్రియాల్ తదితరులు నటించారు. సినిమాను తాను చాలా ఆస్వాదించానని, కంగనా రెండు పాత్రల్లోనూ అద్భుతంగా చేసిందని.. అయితే తను కంటే దత్తో పాత్ర ఎక్కువగా నచ్చిందని తెలిపాడు. సినిమాను ఇమ్రాన్ రెండుసార్లు చూశాడట. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఇప్పటికి రూ. 165 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

>