లవర్స్‌ డేకి దేవ్‌ 

30 Jan, 2019 00:22 IST|Sakshi

‘ఖాకి’ వంటి సూపర్‌ సక్సెస్‌ మూవీతో హిట్‌ పెయిర్‌ అనిపించుకున్నారు కార్తీ, రకుల్‌ ప్రీత్‌సింగ్‌. తాజాగా వారిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘దేవ్‌’. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహించారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్‌’ మధు సొంతం చేసుకున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమర్పణలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ఠాగూర్‌’ మధు మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది.

హారిస్‌ జయరాజ్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ పవర్‌ఫుల్‌ రోల్స్‌లో నటచారు. నిక్కీ గల్రాని మరో కథానాయికగా చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఫిబ్రవరి 14న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.  కార్తీక్‌ ముత్తురామన్, ఆర్‌.జె. విఘే ్నష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌. వేల్‌రాజ్, బ్యానర్స్‌: ప్రిన్స్‌ పిక్చర్స్, లైట్‌ హౌస్‌ మూవీ మేకర్స్, రిలయన్స్‌ ఎంటరై్టన్‌మెంట్‌. 

మరిన్ని వార్తలు