సూపర్‌ మార్కెట్‌లో సస్పెన్స్‌

24 Sep, 2019 00:27 IST|Sakshi
కృష్ణ, ఎల్సా గోష్‌

హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘కృష్ణారావ్‌ సూపర్‌ మార్కెట్‌’. ఎల్సా గోష్‌ కథానాయిక. బీజేఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ స్టూడియోస్‌ బ్యానర్‌ నిర్మించిన ఈ చిత్రం ద్వారా శ్రీనాథ్‌ పులకరం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్‌ 18న సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా శ్రీనాథ్‌ పులకరం  మాట్లాడుతూ – ‘‘మార్కెట్‌ చుట్టూనే కథ నడుస్తుంది కాబట్టి ‘కృష్ణారావ్‌ సూపర్‌ మార్కెట్‌’ అని టైటిల్‌ పెట్టాం. మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌. కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ రావడంతో మా సినిమాకు మంచి బజ్‌ వచ్చింది’’ అన్నారు నిర్మాతలు.

మరిన్ని వార్తలు