సరికొత్త పోలీస్‌ను చూస్తారు

15 Nov, 2017 01:25 IST|Sakshi

తమిళసినిమా: ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంలో సరికొత్త పోలీస్‌ అధికారిని చూస్తారని ఆ చిత్ర కథానాయకుడు కార్తి అంటున్నారు. ఆయనకు జంటగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించిన ఈ చిత్రాన్ని చతురంగవేట్టై చిత్రం ఫేమ్‌ హేచ్‌.వినోద్‌ దర్శకత్వంలో డ్రీమ్‌వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌.ప్రభు, ఎస్‌ఆర్‌.ప్రకాశ్‌బాబు నిర్మించారు. ఈ నెల 17న చిత్రం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో కార్తీ మాట్లాడుతూ పోలీస్‌ అనగానే సూపర్‌మ్యాన్‌గానో లేక ఇతర గ్రహాలనుంచి వచ్చిన వాడిగానో చూస్తున్నారన్నారు. మన అన్నయ్య, తమ్ముడు పోలీస్‌ అధికారి కావచ్చునని అన్నారు. అలాంటి పోలీస్‌ను ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంలో చూడవచ్చునని అన్నారు. పోలీస్‌ అధికారికి ట్రైనింగ్‌లో ఆ ఉద్యోగానికి తగ్గట్టుగా శిక్షణ మాత్రమే ఇస్తారన్నారు. అతను ఎలాంటి పోలీస్‌ అవుతాడన్నది తను వచ్చిన పరిస్ధితులను బట్టి ఉంటుందన్నారు.

తాను ఒక పోలీస్‌ అధికారిని కలిసినప్పుడు ఆయన ఒక కాలేజీ ప్రొఫెసర్‌ కావాలని ఆశించినట్లు, పరిస్థితుల ప్రభావంతో పోలీస్‌ అయినట్లు తెలిపారన్నారు. అలాంటి కొన్ని సన్నివేశాలనే తాను ఇంతకు ముందు నటించిన చిరుతై చిత్రంలో పొందుపరిచినట్లు తెలిపారు. ధీర న్‌ అధి కారం ఒండ్రు పోలీస్‌ కథ మరో లా ఉం టుందన్నారు. ఇది 1995నుంచి 2005 వరకూ జరిగిన యథార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం గా, పోలీస్‌ను మరో కోణంలో చూ పించే విధంగా ఉంటుంద ని చెప్పారు. ఈ చిత్రం కోసం తాను కొందరు పోలీస్‌ అధికారులను కలిసి వారి సలహా లు, సూచనలు తీ సుకుని నటిం చా నని తెలిపారు.

మరిన్ని వార్తలు