అది మా అదృష్టం

15 Oct, 2018 01:15 IST|Sakshi
అర్జున్‌ యజత్, సౌమ్య వేణుగోపాల్

‘‘మూడు పువ్వులు ఆరు కాయలు’ సినిమా మూడు సార్లు ఆగిపోయింది. ఆరు మంది నిర్మాతలు మారారు. చివరకు మా ఫ్రెండ్‌ వబ్బిన వెంకట్రావు నిర్మాతగా ఈ సినిమా పూర్తి చేశాం’’ అని డైరెక్టర్‌ రామస్వామి అన్నారు. ‘‘అర్ధనారి’ ఫేమ్‌ అర్జున్‌ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్‌ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. డాక్టర్‌ మల్లె శ్రీనివాస్‌ సమర్పణలో వెంకట్రావు నిర్మించారు.

ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో రామస్వామి మాట్లాడుతూ– ‘‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా గురువారం విడుదలైంది. మా సినిమా శుక్రవారం రిలీజ్‌ అయింది. ఆ చిత్రానికి మేం పోటీ కాదు. మాకు ఎన్టీఆర్‌ గారంటే గౌరవం, త్రివిక్రమ్‌గారంటే ఇష్టం. వాళ్ల సినిమా మధ్య మా చిత్రం విడుదల చేయడం మా అదృష్టం. ఆ సినిమాకు వచ్చిన ఓవర్‌ ఫ్లోతో మా హాల్‌ నిండినా చాలనుకున్నాం’’ అన్నారు. డా.మల్లె శ్రీనివాసరావు,  భరత్‌ బండారు, వబ్బిన వెంకట్రావు, సంగీత దర్శకుడు కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు