-
Ashwin Ramaswami: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!
భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయా అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్‌కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్‌తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు. చదవండి: Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు -
వివేక్‌తో విందుకు ఫీజు 50 వేల డాలర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కలిసి మాట్లాడుకుంటూ విందారగించాలనుకుంటున్నారా? అలాగైతే సుమారు రూ.42 లక్షలు చెల్లిస్తే చాలు..! సిలికాన్ వ్యాలీకి చెందిన పలు బడా సంస్థలు కొన్ని వివేక్కి ఎన్నికల ప్రచార నిధులను సేకరించి పెట్టేందుకు ఈ నెల 29వ తేదీన విందు ఏర్పాటు చేశాయి. ఇందులో వివేక్‌తోపాటు పాల్గొనాలనుకునే వారు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని రూ.41.47 లక్షలు (50 వేల డాలర్లు)గా ఖరారు చేశారు. విందు ద్వారా మొత్తం 10 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఇన్వెస్టర్, సోషల్ కేపిటల్ సంస్థ సీఈవో చమత్ నివాసంలో ఈ విందు జరగనుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో అగ్రస్థానంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో వివేక్ రామస్వామి నిలిచిన విషయం తెలిసిందే. -
ఆయన గెలిస్తే భారతీయ టెక్కీల అమెరికా ఆశలు గల్లంతే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్-1బీ (H-1B) వీసాల జారీని ఎత్తేస్తానని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను "ఒప్పంద దాస్యం"గా అభివర్ణించారు. లాటరీ ఆధారిత ఈ వీసా వ్యవస్థను తొలగించి దాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్‌తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశారు. అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునేది హెచ్-1బీ వీసానే. ఇది వలసేతర వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలకు ఇది అనుమతిస్తుంది. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతుంటాయి. రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్‌ను 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం. రామస్వామి స్వయంగా 29 దరఖాస్తులు 2018 నుంచి 2023 వరకు రామస్వామి పూర్వ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి 29 దరఖాస్తులను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది. అయినప్పటికీ H-1B వీసా వ్యవస్థ సక్రమంగా లేదని రామస్వామి చెప్పినట్లుగా యూఎస్ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో పేర్కొంది. రామస్వామి 2021 ఫిబ్రవరిలో రోవాంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. స్వతహాగా వలసదారుల సంతానమైన రామస్వామి.. ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా చెప్పారు. (దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..) కాగా H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021 ఆర్థిక సంవత్సరానికి 85,000 వీసా స్లాట్లు అందుబాటులో ఉండగా అమెరికన్ కంపెనీలు ఏకంగా 7,80,884 దరఖాస్తులను సమర్పించాయి. అంతకుముందు ఏడాది కంటే ఆ సంవత్సరంలో కాగా H-1B వీసా దరఖాస్తులు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. -
US Presidential Elections: మూడొంతుల మందిని సాగనంపుతా!
వాషింగ్టన్: తాను అధ్యక్షుడినైతే అమెరికా ప్రభుత్వంలోని ముప్పావు వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యరి్థత్వం కోసం పోటీపడుతున్న వివేక్ రామస్వామి సంచలన ప్రకటన చేశారు. భారతీయ మూలాలున్న వివేక్.. అమెరికన్ వార్తా వెబ్సైట్ యాక్సియస్కు ఇచి్చన ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘ రిపబ్లికన్ పార్టీ అభ్యరి్ధత్వం సాధించి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటే వెంటనే నా పని మొదలుపెడతా. దేశవ్యాప్తంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా. ఇన్ని లక్షల మంది సిబ్బంది అమెరికా సర్కార్‌కు పెనుభారం. ఇక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వంటి ప్రధాన దర్యాప్తు సంస్థలను మూసేస్తా. విద్య, ఆల్కాహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, అణు నియంత్రణ కమిషన్, అంతర్గత ఆదాయ సేవలు, వాణిజ్య శాఖల ప్రక్షాళనకు కృషిచేస్తా. అధ్యక్షుడిగా తొలి ఏడాది పూర్తయ్యేలోపు సగం మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతా. మిగతా సగం మందిలో 30 శాతం మందితో వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ చేయిస్తా. ఇందులో అనుమానమేమీ లేదు. పిచి్చపని అస్సలుకాదు’ అని 38 ఏళ్ల వివేక్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో 22.5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 75 శాతం మందిని అంటే దాదాపు 16 లక్షల మందిని వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగాల నుంచి తీసేస్తానని వివేక్ లెక్కచెప్పారు. ఇన్ని లక్షల మందిని తీసేస్తే ప్రభుత్వంపై వేతన భారం భారీగా తగ్గుతుందని ఆయన అభిప్రాయం. -
వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యక్షునిగా రామస్వామి బలమైన అభ్యర్థి కాగలడని, మంచి మనిషి అని పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరికి ఆమోదం తెలుపనున్నారనే సందిగ్ధంలో ఆయన ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'వివేక్ మంచి మనిషి. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతని వద్ద మంచి మేధాశక్తి ఉంది. ఏదో మంచి మార్పును తీసుకురాగలడు. నా కంటే గొప్ప ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఎవరైనా నన్ను బెస్ట్ అధ్యక్షునిగా గుర్తిస్తే.. నేను అతనిలా ఉంటాను' అని ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్‌ను 21వ శతాబ్దపు బెస్ట్ ప్రెసిడెంట్‌గా రామస్వామి అభివర్ణించారు. ఈ మాటలు రామస్వామికి ఎంతో ఆధరణను ఇచ్చాయని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు వివేక్ రామస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రామస్వామికి ట్రంప్ ఆమోదం తెలపడం వచ్చే ఎన్నికల్లో మంచి ఊపునిచ్చే అంశమని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా.. వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు. ఇదీ చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’.. తీవ్ర పదజాలంతో ట్రంప్ దూషణ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement