సమంత బర్త్‌డే.. నాగచైతన్య సర్‌ఫ్రైజ్‌

28 Apr, 2020 08:47 IST|Sakshi

ఏ మాయ చేసావె చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సమంత.. విభిన్న పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తెలుగులో మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్, నాగ చైతన్య, నాని.. కలిసిన నటించిన సమంత స్టార్‌ హోదాను దక్కించుకున్నారు. కేవలం గ్లామర్‌ పాత్రలే కాకుండా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో కూడా అదరగొడుతున్నారు. అలాగే  నటనకు ప్రాధాన్యం ఉన్న చిన్న రోల్స్‌లో కూడా మెప్పించడం ఆమెకే చెల్లింది. అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. తెలుగింటి కోడలిగా మారారు. పైళ్లైనా తర్వాత నటనను కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

ప్రస్తుతం కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో నాగచైతన్య- సమంత దంపతులు ఇంటికే పరమితమయ్యారు. అయితే నేడు(ఏప్రిల్‌ 28) సమంత పుట్టినరోజు సందర్భంగా నాగచైతన్య ఆమెను సర్‌ఫ్రైజ్‌ చేశారు. సమంత కోసం చైతన్యనే స్వయంగా బర్త్‌ డే కేక్‌ను తయారు చేశారు. అనంతరం సమంత కేక్‌ కట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, చైతన్య కేక్‌ తయారుచేస్తున్న వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఫ్యామిలీ లవ్‌.. నేను ఏం ప్రార్థిస్తున్నానో.. ఊహించడానికి  మీ దగ్గర పాయింట్స్‌ లేవు’ అని పేర్కొన్నారు. మరోవైపు సమంత బర్త్‌ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆమె శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, పెళ్లికి ముందు నాగచైతన్యతో కలిసి ‘ఏ మాయ చేసావె’, ‘ఆటోనగర్‌ సూర్య’ చిత్రాల్లో నటించిన సమంత, పెళ్లైనా తర్వాత మజిలీ ఇద్దరూ కలిసి ‘మజిలీ’ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. 

చదవండి : నటనకు లైక్‌ కొట్టే నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా