అప్పుడు ఆలియా చిన్నపిల్ల

17 Jul, 2018 00:33 IST|Sakshi
అయాన్, అమల, నాగార్జున, ఆలియా, రణ్‌బీర్‌

నాగార్జున

‘‘లాస్ట్‌ టైమ్‌ నేను హిందీ సినిమా చేసినప్పుడు ఆలియా భట్‌ చిన్నపిల్ల. ఇప్పుడు తనతో కలిసి యాక్ట్‌ చేస్తున్నాను’’ అని నవ్వుతూ అంటున్నారు నాగార్జున. రణ్‌బీర్‌ కపూర్, అమితాబ్‌ బచ్చన్, ఆలియా భట్‌ ముఖ్య పాత్రల్లో దర్శకుడు అయాన్‌ ముఖర్జీ రూపొందిస్తున్న ఫ్యాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. 15 ఏళ్ల తర్వాత నాగార్జున నటిస్తున్న హిందీ చిత్రం ఇది. ఈ సినిమాలో యాక్ట్‌ చేయడం గురించి నాగ్‌  మాట్లాడుతూ – ‘‘లాస్ట్‌ టైమ్‌ హిందీ సినిమా ఎప్పుడు చేశానో సరిగ్గా గుర్తు లేదు.

‘బ్రహ్మాస్త్ర’ కథ చాలా నచ్చింది. తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. ఈ టైమ్‌లో ఇలాంటి పాత్ర ఒకటి వస్తుందని ఊహించలేదు. స్టోరీ బావుంటే ఏ సినిమాలో అయినా యాక్ట్‌ చేయడానికి నేనెప్పుడూ రెడీ.    అమితాబ్‌ తప్ప మిగతా అందరితో యాక్ట్‌ చేయడం ఫస్ట్‌ టైమ్‌. బల్గేరియాలో షూట్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను’’ అన్నారు. ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున రోల్‌ గురించి కరణ్‌ మాట్లాడుతూ – ‘‘ఇందులో నాగార్జున యాక్ట్‌ చేయడం హానర్డ్‌గా, ఎగై్జటింగ్‌గా అనిపిస్తోంది. మీ (నాగార్జున) ప్రేమకు, ఎనర్జీకి థ్యాంక్యూ’’ అని పేర్కొన్నారు. రెండు పార్ట్స్‌గా రూపొందుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్‌ పార్ట్‌ వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్‌ కానుంది. అన్నట్లు ఈ షూటింగ్‌ లొకేషన్‌కి అమల కూడా వెళ్లారు.

మరిన్ని వార్తలు