క్రేజీ కాంబినేషన్!

18 Oct, 2014 23:30 IST|Sakshi
క్రేజీ కాంబినేషన్!

 మామూలుగా స్టార్ హీరో నటించే ఏ సినిమా అయినా ప్రేక్షకులకు ఆసక్తికరమే. ఇక మల్టీస్టారర్ అయితే ఆ క్రేజ్ అంబరాన్నంటుతుంది. నాగార్జున, కార్తి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందనే వార్త గత కొంతకాలంగా మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ విషయాన్ని పీవీపీ సంస్థ అధినేత పొట్లూరి వి. ప్రసాద్ శనివారం అధికారికంగా ప్రకటించారు. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని ఆయన చెప్పారు. ‘మున్నా’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్, ‘బృందావనం’ వంటి కుటుంబ కథా చిత్రం, ‘ఎవడు’ వంటి మాస్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించి, ప్రతిభ నిరూపించుకున్న వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి