పోలీస్ పాత్రలో కింగ్..?

16 Nov, 2016 12:27 IST|Sakshi
పోలీస్ పాత్రలో కింగ్..?

ప్రస్తుతం సీనియర్ హీరోలలో ఫుల్ ఫాంలో ఉన్న స్టార్ కింగ్ నాగార్జున. యంగ్ జనరేషన్ జోరు పెంచటంతో కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ప్రయోగాత్మక చిత్రాలతో అలరిస్తున్న నాగ్ త్వరలో ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడట. ఇటీవల ఊపిరి సినిమాతో అలరించిన మన్మథుడు, ప్రస్తుతం చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఓం నమోవేంకటేశాయ సినిమాలో పరమ భక్తుడు హాథీరాం బాబాగా నటిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత కాస్త చేంజ్ కోసం ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాడు నాగ్. అందుకే చందూ మొండేటి దర్శకత్వంలో ఓ పోలీస్ కథతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కార్తీకేయ, ప్రేమమ్ సినిమాల సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న చందూ, తన నెక్ట్స్ సినిమాను నాగ్ లాంటి సీనియర్ హీరోతో చేస్తే తన రేంజ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నాడట. మరి ప్రయోగాల మూడ్లో ఉన్న నాగ్, చందూ కథకు ఓకె చెప్తాడో లేదో చూడాలి.