నాగ్ రిలీజ్ డేట్ చెప్పేశాడు

4 Dec, 2016 14:04 IST|Sakshi
నాగ్ రిలీజ్ డేట్ చెప్పేశాడు

ప్రస్తుతం సీనియర్ హీరోలందరూ తమ సినిమాలతో రెడీ అయిపోతున్నారు. అసలు నలుగురు సీనియర్లు సంక్రాంతి బరిలోనే దిగుతారని భావించినా.. ముఖాముఖి పోటి నుంచి తప్పుకొని కాస్త అటు ఇటుగా సర్దుకున్నారు. ఇప్పటికే చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలు సంక్రాంతి బరిలో పోటి పడటం కాయమైపోయింది.

ఇక కాస్త ఆలస్యంగా వస్తున్న విక్టరీ వెంకటేష్, తన గురు సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఒక్క నాగార్జున విషయంలోనే ఇన్నాళ్లు సస్పెన్స్ కొనసాగింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయ సినిమాలో నటిస్తున్న నాగార్జున, గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సినిమా రిలీజ్ డేట్ ను ముందే చెప్పలేమని ప్రకటించాడు.

అయితే ఇప్పటికే షూటింగ్ తో పాటు కొంత మేర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావటంతో సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది. చారిత్రక కథతో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. బాలీవుడ్ నటుడు సౌరబ్ జైన్ వేంకటేశ్వరునిగా నటిస్తున్న ఈసినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.