నాని ‘రాక్షసుడు’.. అదిరిపోయింది

28 Jan, 2020 12:14 IST|Sakshi

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో రూపోందుతున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘అష్టా చమ్మా’, ‘నాని జెంటిల్‌మన్‌’ వంటి హిట్‌ చిత్రాలను నానికి అందించిన మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శక​త్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జెంటిల్‌మన్‌ తరహాలో నాని నెగటీవ్‌ షేడ్స్‌లో కనిపించనున్నాడు. తన 25వ చిత్రంలో నేచరల్‌ స్టార్‌ రాక్షసుడుగా కనిపించనున్నారని చిత్ర యూనిట్‌ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ‘వి’ చిత్రంలోని నాని రాక్షసుడుకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 

తాజాగా విడుదల చేసిన లుక్‌లో నాని గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తూ... చేతిలో కత్తెర, చేయి మీద నుండి కారుతున్న రక్తంతో అదిరింది. ఈ లుక్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన సుధీర్‌ బాబు రక్షకుడుకు సంబంధించిన లుక్‌ నెటిజన్లను ఆకట్టుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా నాని లుక్‌ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించారు. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా