హిట్‌ షురూ

25 Oct, 2019 05:41 IST|Sakshi
రుహానీ శర్మ, విశ్వక్‌ సేన్, నాని

వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను సాధించి తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు హీరో నాని. కొత్త ప్రతి¿¶ ను ప్రోత్సహించాలని ‘వాల్‌పోస్టర్‌ సినిమా’ అనే బ్యానర్‌ను ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే ‘అ!’ వంటి వైవిధ్యమైన సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించి నిర్మాతగా సక్సెస్‌ను సాధించిన నాని రెండో సినిమాకి గురువారం కొబ్బరికాయ కొట్టారు. వాల్‌పోస్టర్‌ సినిమా ప్రొడక్షన్‌ నెం.2గా తెరకెక్కనున్న ‘హిట్‌’ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ‘ఫలక్‌నుమాదాస్‌’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్‌ సేన్‌ ఈ చిత్రంలో కథానాయకునిగా నటిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్‌. ఈ చిత్రం ద్వారా శైలేష్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్, కెమెరా: ఎస్‌.మణికందన్‌.

మరిన్ని వార్తలు