జై బోలో గణేశ్‌ మహరాజ్‌కీ జై

5 Apr, 2018 00:49 IST|Sakshi
ఆన్‌ లొకేషన్‌...

వినాయక చవితి ఉత్సవాల్లో బిజీ బిజీగా ఉన్నారు నాగార్జున అండ్‌ నాని. ఎట్టెట్టా.. వేసవిలో వినాయక చవితినా! జనరల్‌గా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో కదా వినాయక చవితి సెలబ్రేషన్స్‌ జరిగేది అంటే నిజమే. కానీ ఇది రీల్‌పై బాసూ.  అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో నాగార్జునది ఒక వినాయక విగ్రహం, నానీది మరో గణేశ్‌ విగ్రహం అంట. మరి నిమజ్జనం టైమ్‌లో ఎన్‌ అండ్‌ ఎన్‌ ఎదురవుతారా? ఒకవేళ ఎదురైతే అప్పుడేం జరుగుతుంది? ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరుగుతుందా? తదితర విషయాలు స్క్రీన్‌పై చూడాల్సిందే.

నాగార్జున, నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మాణంలో ‘శమంతకమణి’ ఫేమ్‌ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఫస్ట్‌ షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేశారు. హైదరాబాద్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేశారు. వినాయక చవితి ఫెస్టివల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సాంగ్స్‌తో పాటుగా, కొన్ని సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారని సమాచారం. నాగ్, నానీలతో పాటు వందమందికిపైగా డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ లొకేషన్‌ ‘జై బోలో గణేశ్‌ మహరాజ్‌కీ జై’ అని మారుమోగిపోతోందట. ‘‘ఈ రోజు (బుధవారం) చిన్నపిల్లాడిలా ఎంతో ఎగై్జటింగ్‌గా షూటింగ్‌కి వెళుతున్నా. ఎందుకంటే ఇవాళ కింగ్‌ (నాగార్జున) ఎంటరవుతున్నారు’’ అంటూ ఇక్కడ పండగ వాతావరణం తలపిస్తున్న ఫొటోను నాని షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు