ఉదయ్, మాళవిక హీరో హీరోయిన్లుగా అళగుమగన్.

18 Jul, 2013 06:39 IST|Sakshi
ఉదయ్, మాళవిక హీరో హీరోయిన్లుగా అళగుమగన్.
నూతన తారలు ఉదయ్, మాళవిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అళగుమగన్. అవతార్ మూవీస్ అధినేత ఆర్.సెల్వి తరుణ్ క్రియేషన్ జ్ఞానదేశ్ అంబేద్కర్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను అళగన్ సెల్వి నిర్వహిస్తున్నారు. పలు టీవీ, సినీ దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఈయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం అళగు మగన్.
 
  జి.ఎం.కుమార్, పవన్, రాజ్‌కపూర్, ఇళవరసు, సింథియ, గోపాల్, విజి, సింగంపులి, నితీష్ విచిత్రన్, వైరవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ స్నేహితులే లోకంగా జీవించే హీరో మనసులో ప్రేమ పుడుతుందన్నారు. ఒక సమయంలో ప్రేమ, స్నేహం వీటిలో దేనిని వదులుకోవాలన్న సందిగ్ధ పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రేమనే వదలుకుంటారన్నారు.
 
  ఈ కథాంశంతో కూడిన చిత్రమే అళగు మగన్ అని చెప్పారు. అగమలై, పులిగుహై తదితర ప్రాంతాలలో అధిక భాగం షూటింగ్ జరిగిందన్నారు. వాహనాలు వెళ్లని ప్రాంతాలకూ పది కిలోమీటర్లు నడిచి వెళ్లి ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. చిత్రం ఊహించిన దానికంటే బాగా వచ్చిందని, శ్రమకు తగ్గ ఫలితం దక్కిందన్న ఆనందంతో చిత్ర యూనిట్ ఉందని దర్శకుడు తెలిపారు.
>