వైరల్‌ : పార్టీలో నివేదా డ్యాన్స్‌!

25 Nov, 2018 20:01 IST|Sakshi

క్యూట్‌ లుక్స్‌తో, న్యాచురల్‌ యాక్టింగ్‌తో కుర్ర హృదయాలను కొల్లగొట్టారు నివేదా థామస్‌. జెంటిల్‌మెన్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దు గుమ్మ.. నిన్నుకోరి, జై లవకుశలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆ మధ్య చదువు కోసం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన నివేదా.. ఇటీవలె పలు ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నివేదా.. తాజాగా ఓ వీడియోను పోస్ట్‌చేశారు. ఇందులో నివేదా డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ప్రభుదేవా హీరోగా వచ్చిన గులేభకావలి సినిమాలోని సాంగ్‌కు.. నివేదా వేసిన స్టెప్స్‌ అదిరిపోయాయని అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు. తన సోదరులతో కలిసి ఆడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ‘మీరు పార్టీని ఎలా ఎంజాయ్‌ చేస్తారు?.. మీ హీల్స్‌ను విసిరేయండి..వెళ్లి డ్యాన్స్‌చేయండి’ అంటూ కామెంట్‌తో పాటు వీడియోను పోస్ట్‌ చేశారు. నిఖిల్‌ హీరోగా చేస్తోన్న‘శ్వాస’ సినిమాలో నివేదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

మరిన్ని వార్తలు