శంకర్తో సినిమా చేయట్లేదు: మహేశ్ బాబు

10 Sep, 2014 12:57 IST|Sakshi
శంకర్తో సినిమా చేయట్లేదు: మహేశ్ బాబు

విభిన్న చిత్రాలతో జాతీయస్థాయిలో అగ్రదర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్తో ప్రస్తుతానికి తాను ఎలాంటి సినిమా చేయడం లేదని సూపర్స్టార్ మహేశ్ బాబు స్పష్టం చేశాడు. 'ఆగడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఈనెల 19న వస్తున్న మహేశ్.. తన రాబోయే చిత్రం మాత్రం శంకర్తో కాదని తెలిపాడు. ఆగస్టు 30వ తేదీన జరిగిన 'ఆగడు' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి శంకర్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందుకు ప్రత్యేక కారణం ఏమీ లేదని, తాను శంకర్ దర్శకత్వంలో సినిమా ఏమీ చేయడంలేదని మహేశ్ తెలిపాడు.

'ఆగడు' సినిమా విడుదల కాగానే తన తదుపరి ప్రాజెక్టులో బిజీగా ఉంటానని ఈ సూపర్ స్టార్ చెప్పాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ తదుపరి సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. తాను శంకర్ దర్శకత్వం వహించిన 'ఐ' సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో కూడా తాను పాల్గొనబోవడం లేదని మహేశ్ చెప్పాడు. ఆ సమయానికి తాను వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని చెబుతూ.. శంకర్ టీమ్కు అభినందనలు తెలిపాడు.