హీరో విశాల్ - ఓ దశాబ్ధం

10 Sep, 2014 13:04 IST|Sakshi
హీరో విశాల్ - ఓ దశాబ్ధం

చెన్నై: దక్షిణాది యువ హీరో విశాల్(విశాల్ కృష్ణా రెడ్డి) సినిమా రంగంలో అడుగుపెట్టి ఈరోజుకు దశాబ్ధం పూర్తి అయింది. విశాల్ నటించిన 'చెల్లామే' 2004 సెప్టెంబరు 10న విడుదలైంది. ఈరోజుకు పది సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా విశాల్ ఇప్పటి వరకు తన సినీరంగ ప్రయాణం చాలా గొప్పగా సాగిందన్నారు. ఇప్పటి వరకు సినిమా రంగంలో తనకు సహకరించిన వారందరికీ, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విభిన్న కథాంశాలతో, నటనకు ప్రాధాన్యత గల పలు చిత్రాలలో విశాల్ నటించారు.  ప్రముఖ నిర్మాత, వ్యాపారావేత్త అయిన జికె రెడ్డి కుమారుడైన విశాల్ చెన్నైలోనే పుట్టిపెరిగాడు.  పందెంకోడి, పల్నాడు, ఇంద్రుడు, వాడువీడు, సెల్యూట్, ధీరుడు..వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

ప్రారంభం నుంచి విశాల్ అంచలంచలుగా ఎదుగుతూ వచ్చాడు. దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్నాడు.తెలుగులోకి అనువాదమైన విశాల్ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల విశాల్ ఫిల్మి ఫ్యాక్టరీ అనే సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా మారాడు. పాండియనాడు, నాన్సింగప్పు మణితన్ చిత్రాలు నిర్మించాడు. పూజై చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ పూజై చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ తమిళ హీరో విశాల్ త్వరలో తెలుగులో డైరెక్ట్ చిత్రంలో నటించబోతున్నారు.
**