బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు స్వాధీనం

28 Dec, 2018 16:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరో మహేష్‌బాబుకు సంబంధించిన బ్యాంకు ఖాతాల నుంచి రూ. 42 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు జీఎస్టీ అధికారులు తెలిపారు. ఇంకా రూ. 31 లక్షలు ఆయన నుంచి రాబట్టాల్సివుందని చెప్పారు. మొత్తం రూ. 73 లక్షలు పన్ను బకాయి చెల్లించాల్సివుందన్నారు. 2007-08లో ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయానికి సర్వీసు ట్యాక్స్‌ చెల్లించకపోవడంతో మహేష్‌బాబు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ కమిషనరేట్‌ జప్తు చేసింది.

యాక్సిస్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ. 31 లక్షలు రికవరీ చేశామని, మిగతా మొత్తం ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్‌ నుంచి స్వాధీనం చేసుకుంటామని జీఎస్టీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. పన్ను బకాయిలకు సంబంధించి 2010లో నోటీసు ఇచ్చామన్నారు. ఆయన స్పందించకపోవడంతో 2012లో ఆర్డర్‌ పాస్‌ చేశామన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకున్నా ఆయనకు ఊరట లభించలేదన్నారు. ట్రైబ్యునల్‌ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టును మహేష్‌ ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఆర్థిక చట్టం సెక్షన్‌ 87 ప్రకారం ఆయన బ్యాంకు ఖాతాలను జప్తు చేసినట్టు వివరించారు. 

మరిన్ని వార్తలు