ప్రతీకారం నేపథ్యంలో...

4 Oct, 2019 02:35 IST|Sakshi
నితిన్, విరాట్, సంతోష్‌

‘పరిచయం’ చిత్రంతో హీరోగా పరిచయమైన విరాట్‌ హీరోగా నటిస్తున్న రెండో సినిమా త్వరలో ప్రారంభం కానుంది. నితిన్‌ జి.దర్శకత్వం వహించనున్నారు. ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్స్‌పై సంతోష్‌ వై.కె, నిమేశ్‌ దేశాయ్‌ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్స్‌ లోగో ఆవిష్కరించారు. నితిన్‌ జి. మాట్లాడుతూ– ‘‘రివెంజ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.

నవంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభమవు తుంది’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో ఈ సినిమా చేస్తున్న దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌. నితిన్‌లాంటి ప్రతిభావంతుడితో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీ’’ అన్నారు విరాట్‌. నిర్మాతల్లో ఒకరైన సంతోష్‌ మాట్లాడుతూ... ‘‘నితిన్‌ చెప్పిన స్టోరీ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జైపాల్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నగేష్‌ పూజారి, సహ నిర్మాత: అతుల్‌ పాటిల్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు