'పద్మావతి' పై రాజస్థాన్‌ ప్రభుత్వం కమిటీ

10 Nov, 2017 14:37 IST|Sakshi

రాజస్థాన్‌: వివాదాలతో నిత్యం వార్తల్లో నలుగుతున్న పద్మావతి మూవీపై రాజస్థాన్‌ ప్రభుత్వం కమిటీని నియమించనుంది. సంజయ్‌లీలా భన్సాలి నిర్మించిన పద్మావతి చిత్రంపై మొదటి నుంచి వివాదాలు ముసురుకున్నాయి. దీంతో వివాదాల నేపధ్యంలో సినిమాపై కమిటీ వేయాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌పుట్‌లు, ఇతర సంఘాలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. దర్శకుడు భన్సాలీ చరిత్రను వక్రీకరించారంటూ దీనిపై నిషేధం విధించాలని డిమాండ్లు కూడా చేస్తున్నాయి.

దీంతో కమిటీ నియమించాలని.. ఆ విషయంపై అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి గులాబ్‌చంద్‌ కటారియా తెలిపారు. కమిటీ పద్మావతి సినిమాను చూస్తుందని, మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు చిత్రంలో ఉన్నాయో లేదో చూస్తామని తెలిపారు. ఆ తర్వాత  చిత్ర దర్శక నిర్మాతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కమిటీ చరిత్రకారులతో ఉండే అవకాశం ఉందన్నారు. కాగా పద్మావతి మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

మరిన్ని వార్తలు