రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

3 Nov, 2018 13:21 IST|Sakshi

భారతీయ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.ఓ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ విజువల్స్‌ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ ట్రైలర్‌ లాంచింగ్‌ సందర్భంగా హీరో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ సందర్భంగా మానసికంగా శారీరకంగా చాలా శ్రమపడాల్సి వచ్చిందన్నారు.

‘దాదాపు 12 కేజీల సూట్‌వేసుకొని షూటింగ్ చేయటం కష్టమనిపించింది. అదే సమయంలో 3డీలో తెరకెక్కిస్తున్న కారణంగా ఒక్కే షాట్ 8, 9 సార్లు తీయాల్సి వచ్చేది. ఓ దశలో ఇక సినిమా చేయలేనని శంకర్‌తో చెప్పేశా. కానీ శంకర్‌ మీరే ఈ సినిమా చేయాలి, చేయగలరని నన్ను ఒప్పించారని’ తెలిపారు.

‘నిర్మాత శుభకరన్‌ కూడా ఎంతో సహకరించారు. షూటింగ్ మొదలు పెట్టిన కొద్ది రోజులకే నా ఆరోగ్యం దెబ్బతింది. దీంతో షూటింగ్ చాలా ఆలస్యమైంది. అప్పుడు నిర్మాత నాలుగు నెలలు కాదు నాలుగు సంవత్సరాలైనా మీరు రెస్ట్ తీసుకోండి మీ ఆరోగ్యం ముఖ్యం అన్నారు. వారి సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందన్నా’రు రజనీ.

ఈ సినిమా తరువాత శంకర్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుదంటారన్న రజనీ.. అక్షయ్‌నో నన్నో నమ్మి రూ. 600 కోట్లు పెట్టుబడి పెట్టలేదు, కేవలం శంకర్‌ను నమ్మి మాత్రమే నిర్మాత ఇంత ఖర్చు పెట్టారని తెలిపారు. అంతేకాదు శంకర్ ఇండియన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామరన్ అని ఆకాశానికి ఎత్తేశారు. శంకర్‌, రాజమౌళి, రాజ్‌కుమార్‌ హిరాణీ లాంటి వారు జెమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అన్నారు రజనీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు