జూన్ 11న కబాలీ ఆడియో

2 Jun, 2016 18:49 IST|Sakshi

సూపర్ స్టార్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. లింగా లాంటి డిజాస్టర్ తరువాత రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కబాలీ. తొలి టీజర్తోనే అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కబాలీ, ఆడియో కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్గా జూలై 1న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

అంతకు ముందు ఆడియో రిలీజ్ను కూడా రజనీ ఇమేజ్కు తగ్గట్టుగా భారీగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ముందుగా జూన్ 9న ఆడియో రిలీజ్ చేయాలని భావించినా, ప్రస్తుతం అమెరికాలో ఉన్న రజనీ ఆ సమయానికి అందుబాటులో ఉండడన్న ఉద్దేశంతో, జూన్ 11న ఆడియో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. చెన్నైలోని వైయంసీఏ గ్రౌండ్లో అభిమానుల మధ్య ఆడియో రిలీజ్ వేడుకను భారీగా ప్లాన్ చేస్తున్నారు.

రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. తమిళ్, తెలుగుతో పాటు మలేషియాలో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కబాలీ టీజర్ ఆన్ లైన్లో 2 కోట్లకు పైగా వ్యూస్తో సంఛలనం సృష్టిస్తుండగా ఆడియో రిలీజ్ అయితే మరిన్ని రికార్డ్లు కాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా