యూరోప్‌ పోదాం చలో చలో

3 Jul, 2018 01:23 IST|Sakshi
రామ్‌చరణ్, కియారా అద్వానీ

హైదరాబాద్‌లో విలన్స్‌ అందర్నీ చితకబాదిన తర్వాత హీరోయిన్‌తో ఓ డ్యూయెట్‌ పాడనున్నారట రామ్‌చరణ్‌. ఆ డ్యూయెట్‌ కూడా ఫారిన్‌లో పాడుకోనున్నారు. అందుకే హీరోయిన్‌తో కలసి యూరోప్‌ వెళ్లనున్నారని సమాచారమ్‌. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్, ఆర్యన్‌ రాజేశ్, ప్రశాంత్, స్నేహా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి హై వోల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంటర్వెల్‌ సీన్స్‌కు సంబంధించిన ఈ ఫైట్‌లో 200మంది ఫైటర్స్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌లో ఓ ఫారిన్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారట బోయపాటి శ్రీను. దానికి సంబంధించిన లొకేషన్స్‌ కూడా ఫిక్స్‌ చేశారట. ఈ షెడ్యూల్‌లో సాంగ్స్‌తో పాటు హీరో హీరోయిన్‌పై కొన్ని సీన్స్‌ కూడా చిత్రీకరించనున్నారు. తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా