సివిల్స్‌ టాపర్‌కు నేను స్ఫూర్తి : వర్మ

9 May, 2018 21:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ట్విటర్‌లో తనదైన వ్యాఖ్యాలతో.. విరుచుకుపడే రామ్‌ గోపాల్‌వర్మ తనను విమర్శించే వారికి ఓ సూచన చేశాడు. ‘నేను ఎప్పుడూ క్రిమినల్స్‌ నుంచి, బూతు నుంచి స్ఫూర్తి పొందుతానని భావించేవారు.. ఈ సివిల్స్‌ టాపర్‌ ఏం చెప్పాడో ఒకసారి చూడండి. నేను చదువంటే భయపడే విద్యార్ధినే.. సివిల్‌ ఇంజనీరింగ్‌ రెండు సార్లు ఫెయిల్‌ అయినప్పటికి నేను గర్వపడతాను’ అని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో ‘ఒక సివిల్‌ ఇంజనీరింగ్‌ ఫెయిల్‌ అయిన వ్యక్తి ఓ సివిల్స్‌ టాపర్‌కి స్పూర్తి కల్గించాడు. యెడవల్లి అక్షయ్‌ నేను నిన్ను తప్పక కలుస్తాను.. మనం ఎడ్యుకేషన్‌ గురించి చర్చిద్దాం’ అని పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు