పవన్‌పై వర్మ తాజా ట్వీట్‌

13 May, 2018 11:04 IST|Sakshi

పవన్‌ పై వర్మ ట్వీట్ల దాడి కొనసాగుతోంది. మెగా ఫ్యామిలిని, ప్రత్యేకంగా పవన్‌ ను టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద కామెంట్లు చేస్తున్న వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. శ్రీరెడ్డి ఉదంతం తరువాత వర‍్మ పవన్‌ అభిమానుల మధ్య వార్‌ మొదలైంది. ఇటీవల ఆఫీసర్‌ టీజర్‌కు అన్‌ లైక్‌లు రావటానికి పవన్‌ అభిమానులే కారణం అన్నట్టుగా వర్మ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేలటికెట్‌ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌పై ఆర్జీవీ మళ్లీ ఓ ట్వీటేశారు.

రవితేజ పక్కన కూర్చున్న పవన్‌... రవితేజ వేసుకున్న టోర్న్‌ జీన్స్‌ను చూపిస్తూ ... దాని గురించి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. దీనిపైన వివాదాల వర్మ స్పందిస్తూ... ‘రవితేజకు, పవన్‌ కల్యాణ్‌కు మధ్యలో వున్న ఈ తొడ సంబంధం గురించి లోగుట్టు పెరుమాళ్లకే తెలియాలి. కానీ పీకే కి, రవి ఎడమతొడ మీద చాలా మక్కువ ఉందన్న విషయం పీకే మొహంలో వున్న ఆనందంలో కనబడుతోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు